దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్ధం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూసాడు. గడ్డ పారా ఒక రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూచాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.
వరసిద్ధి వినాయకుని మహిమతో ముగ్గురు అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు త్రవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాల కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు.
ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావువంతుదూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపాకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈరోజుకి కాణిపాకంలో స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అక్కడ ప్రాగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది.
వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఉంది, చిత్తూరు నుండి 11కి.మీ దురంలోనూ ఉంది..
#కాణిపాకం వినాయక #సనాతనధర్మం #Hindu #God #Ganesh