అలేఖ్య చిట్టి పచ్చడి సిస్టర్స్ ఈ ఆడియో లీక్ వలనా ఇష్యూ ఇంకా వైరల్ అయింది -దయచేసి ఇకనైనా ఆపండి|| Yours Telugu Buddy

Shiva Writes
By -
2

ముగ్గురు అక్క చెల్లెలు అలేక్యచిట్టి పికెల్స్  బిజినెస్  తక్కువ కాలంలో ఎంత పాపులర్ అయిందో...  అంతే   తక్కువ సమయంలోనే అలేఖ్య సిస్టర్స నోటి దూల వలన   అలేక్యచిట్టి  పచ్చడ్లు  వ్యాపారము ఒక్కసారిగా కూలిపోయింది. ఎవరైనా వ్యాపారం చేసేటప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే కష్టం ఒక్కటే కాదు సహనంతో పాటు కస్టమర్స్ అంటే గౌరవం కూడా ఉండాలి.



ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కచెల్లెలు అలేఖ్య, చిట్టి మరియు రమ్య ఒకే కుటుంబం కు చెందిన పచ్చడిలా వ్యాపారం చుట్టి వివాదం చెలరేగింది. ఇంట్లో తయారు చేసిన వెజ్ మరియు మాంసాహారం(రొయ్యలు,చికెన్ ,చేపలు రకాలు వంటివి) బాగా పాపులర్ అయినా  అలేఖ్య చిట్టి పచ్చడిల బ్రాండ్ ముగ్గురు అక్క చెల్లెలా సోషల్ మీడియా ప్రభావం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అసలు ఈ పచ్చడిలా బిజినెస్ వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారు, పాపమ్ అనుకోని కారణాలవల్ల వాళ్ళ తండ్రి చనిపోయారు. తర్వాత ఈ ముగ్గురు అక్క చెల్లెలు పచ్చడిల వ్యాపారం కొనసాగించి బాగా వృద్ధిలోకి తీసుకు వచ్చారు. కస్టమర్స్ అనేవాళ్ళు దేవుళ్ళు మనం వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ గౌరవించాలి అని వారే వాళ్ళ నాన్నగారు చెప్పారు అని అది వాళ్ళ వీడియోస్ లో పెట్టుకున్నారు. 

ముగ్గురు అక్కచెల్లెలూ కలసి ఫ్యామిలీని నడిపిస్తున్నారు ఇది ఒక వుమెన్ ఎంపోరిమెంట్ కి ఎగ్జాంపుల్ సపోర్ట్ చేద్దాం అని సపోర్ట్ చేశారు అందరూ. ఎంత సపోర్ట్ చేసారు అంటే వీళ్ళ బిసినెస్ టేకోవర్ చేసిన కొద్దిరోజులల్లోనే 1000 ఆర్డర్స్ కి పైగా వచ్చాయి. ఆర్డరుకి 1000 అనుకున్న 1000 ఆర్డర్లుకి 10 లక్షలు వచ్చాయి. కొన్ని రోజులలోనే వాళ్ళ బిసినెస్ మంచిగా వృద్ధిలోకి వచ్చింది. అయితే, ఒక కస్టమర్ వారి పచ్చడ్లు అధిక ధరలను వాట్సాప్ ద్వారా ప్రశించినప్పుడు వారి పచ్చడిల వ్యాపార పరిస్థితులు మలుపు తిరిగాయి - అరకిలో నాన్-వెజ్ పచ్చడి  ఇలా ఉన్నాయి... 


దీనికి ప్రతిస్పందనగా అలేక్యనుండి అసభ్యకరమైన భాషతో కస్టమర్ తో చీప్ గ మాట్లాడింది. ఆ ఆడియో క్లిప్ బాగా వైరల్   అయినా తర్వాత అగ్రహానిన్ని తెప్పించాయి. ఈ సంఘటన తర్వాత మరో ఆడియో క్లిప్ కూడా లీక్ అయినా తర్వాత   సోషల్ మీడియాలో బాగా వైరల్ అయి అందరికి ఆగ్రహాన్ని తెప్పించాయి. దాంతో వారి బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఆపేయబడ్డాయి మరియు వారి పచ్చడిలా వెబ్సైటు టెంపరరీగా నిలిపివేశారు.  సక్సెసఫుల్ గ నడుస్తున్న బిజినెస్ ని మూసుకోవాలిసి వస్తుంది. 
అందుకే అంటారు పెద్దలు "వాక్కున్న పదును వాడి కత్తికిలేదు  జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త అని కాబ్బట్టి ఎంత ఎదిగిన సరే ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోవాలి " అంటారు. 
చివరకు సోషల్ మీడియా ముందుకి వచ్చి కొంతమంది అసభ్యకరంగా కామెంట్లు పెట్టటం వల్ల ఫ్రూట్రేషన్ లో అలా  తప్పు జరిగింది అని తిట్టినవాళ్లకు క్షమాపణలు చెప్పింది. 

తప్పులు అన్నాక అందరూ చేస్తారు ,  తమ తప్పు తెలుసుకొని , పశ్చాతాపం పడటం దాన్ని మించిన ప్రాయశ్చితమ్ !

ఇదే అదనుగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియా యూట్యూబుర్లు మరియు టీవీ చానెల్స్  ఆడ వాళ్ళు అని చూడకుండా అసభ్యంగా వాళ్ళను ,వారి ఫ్యామిలీ ని  ట్రోల్ చేస్తున్నారు .  మన దేశంలో ఆడవారిపై ఎన్నోదాడులు జరుగుతున్న స్పందించరు. రెండు రోజుల క్రితం ఒక వివాహిత  ఫై దారుణంగా రేప్ చేసి మూత్రం తాగిస్తే ఇప్పడు  5 గురు రేపిస్టులు గురుంచి ఎవరూ ట్రోల్ చేయరు గాని, వాళ్ళు  ఎవరోకూడా తెలియదు గని    సో కాల్డ్ టీవీ చానెల్స్ , సోషల్ మీడియా ఇన్ఫ్లున్సర్స్.     అలేక్యచిట్టి సిస్టర్స్ తమకు అసభ్యమైన కామెంట్స్ పెట్టారు అని  ఏదో ఫ్రాస్ట్రషన్లో తిడితే  ... వాళ్ళు క్షమాపణలు చెప్పిన గాని వారి పై  వారి ఫామిలీ ఫై అసభ్యకరమైన ట్రోల్ల్స్ చేస్తున్నారు. 

ఇక వదులేయండి పాపం! ...ఏదో నోరు జారారు ..ఒకటికి పదిసార్లు తప్పుఒప్పుకొని క్షమాపణ కూడా అడిగారు. ఇష్టం అయితే కొంటారు లేదా కొనరు. వాళ్ళ కష్టం మీద వాళ్లను బ్రతకనివ్వండి. పరివర్తనకు మించి ప్రాయశ్చితం లేదు 🙏.!
దయచేసి ఇకనైనా ఆపండి

#అలేఖ్యచిట్టిపచ్చడ్లు #AlekyachittiPickles


Post a Comment

2Comments

Post a Comment

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn more
Ok, Go it!